విద్యార్థుల తక్కువ హాజరుకు కారణాలేమిటి?
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంపై రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి సర్వే చేపట్టింది.
కోవిడ్-19 కారణంగా 7 నెలలుగా మూతపడి ఉన్న స్కూళ్లను కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నవంబర్ 2 నుంచి దశలవారీగా ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. తలిదండ్రుల అభీష్టం మేరకు పిల్లలను స్కూళ్లకు అనుమతిస్తున్నారు. అయితే, ఆయా తరగతుల విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటుండడంతో ఇందుకు కారణాలేమిటో తెలుసుకోవడానికి ఆయా జిల్లాల్లోని డైట్ కాలేజీలు, ఐఏఎస్‌ఈ, సీటీఈ సంస్థల నుంచి 10 మంది చొప్పున లెక్చరర్లతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. 12వ తేదీ సాయంత్రానికల్లా నివేదికను సమర్పించాలని ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి సూచించారు.
Published date : 12 Nov 2020 04:56PM