విద్యార్ధులు కలసిమెలసి చదువుకోవాలి!!
Sakshi Education
బడిలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన విద్యార్థులు ఉంటారు. ఒకరు అందరితో కలసిపోతారు. మరికొంతమంది స్తబ్ధుగా ఉంటారు. మరికొంతమంది గోల చేస్తుంటారు.
ఇంకొంత మంది చదువుకున్నా ఇతర వ్యాపకాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ఎవరి మనస్తత్వం ఎలా ఉన్నా ఇతర విద్యార్థులతో కలసిమెలసి ఉండడానికే ప్రాధాన్యమివ్వాలి. ఇందువల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు, తనకు తెలిసిన విషయాలను ఇతరుతో పంచుకునేందుకు చక్కని అవకాశం లభిస్తుంది. ఇలా విషయాలను పంచు కొనే అలవాటు వల్ల ఇతర విద్యార్థులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. తమకు తెలియని వాటిని అవతలవారి వద్ద నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మరిన్ని మార్కులు తెచ్చుకొనేందుకు వీలవుతుంది. విద్యార్థి దశలో లభించాల్సింది ఇదే కదా. విరామ సమయంలో ఇతర విద్యార్థులతో స్నేహభావాన్ని పెంపొందించుకోండి. వారితో ప్రేమగా ఉండండి. అవసరమైతే సేవ చేయండి. సేవకు మించిన ఉత్తమ కార్యం మరొకటి లేనేలేదు. అందరి లో భగవంతుడిని చూడండి. అందరూ భగవంతుడి బిడ్డలే కదా. అందువల్ల అవతలివారు ఎంత ఇబ్బంది పెట్టినా ద్వేషించకండి. వారిని క్షమించండి. ఉదాహరణకు మీ తమ్ముడో లేక అక్కో తప్పుచేస్తే మీరు భరిస్తున్నారు కదా. అలాగే భరించం డి. భరించినవారే తరించగలుగుతారు. క్షమాగుణం గొప్పది.
Published date : 30 Jan 2020 04:54PM