వెటర్నరీ వర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ)గా డాక్టర్ వంగూరు రవీందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఇన్‌చార్జి వీసీ అనితా రాజేంద్ర సోమవారం ఆయనను పుష్ప గుచ్చంతో ఆహ్వానించి పదవీ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగేలా, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామన్నా రు. వీసీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 19 Jan 2021 04:19PM