Skip to main content

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అంగన్‌వాడీల్లో ప్రీ ప్రైమరీవిద్య ప్రారంభం: ఆదిమూలపు సురేష్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

నాడు-నేడు కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు.

  • పీ ప్రైమరీ విద్యను స్రీశిశు సంక్షేమ, విద్యాశాఖ సంయుక్తంగా అమలు చేస్తాయి. అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లతో అనుసంధానించి దీన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. తొలుత స్కూళ్ల ఆవరణల్లో ఉన్న వాటిల్లో ప్రీ ప్రైమరీ అమలు. వాటి అభివృద్ధికి నాడు-నేడు ద్వారా నిధులు. రెండో విడతలో మొత్తం అన్ని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు పునఃప్రారంభిస్తాం. అదేరోజు జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభమవుతుంది.
  • కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం కాక 3 నెలల కాలాన్ని విద్యార్థులు నష్టపోతున్నందున అందుకు అనుగుణంగా వివిధ తరగతుల సిలబస్‌ను కుదింపుచేయనున్నాం.
Published date : 18 Aug 2020 01:26PM

Photo Stories