వైఎస్సార్ సంపూర్ణ పోషణకు శ్రీకారం
Sakshi Education
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల అమలుకు రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌స్థాయి కమిటీల ఏర్పాటుతోపాటు మహిళా సంరక్షణ కార్యదర్శి, గ్రామవలంటీర్లకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గర్భిణిలు, బాలింతలకు, 6 నుంచి 72 నెలల్లోపు పిల్లలందరికీ ఒకే రకమైన పోషక పదార్థాలు సరఫరా చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. వీరికి ఈ పోషక పదార్థాలు సక్రమంగా పంపిణీ చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసి, అధికారులను బాధ్యులను చేసింది.
ఈ మేరకు మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ మేరకు మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
- రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి కమిటీలు నెలవారీ సమీక్షలు నిర్వహించాలి.
- పోషక విలువలు కలిగిన ఆహార పదార్థా«ల పంపిణీలో లోపాలను సరి చేయాల్సి ఉంటుంది.
- అంగన్‌వాడీల్లోని మెనూను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ ప్రదర్శించాలి.
- ఆశా, ఏఎన్‌ఎంలు.. అంగన్‌వాడీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సక్రమంగా అమలయ్యేలా చూడాలి.
- గర్భిణిల ఆరోగ్యం, వారి బరువు పెరుగుదలను అంగన్‌వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి.
- మహిళా సంరక్షణ కార్యదర్శులు అంగన్‌వాడీల్లోని పిల్లల హాజరును, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించాలి.
- గ్రామ వలంటీర్లు గ్రామంలోని అర్హులను గుర్తించి, వారు ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి చర్యలు తీసుకోవాలి.
Published date : 05 Aug 2020 05:19PM