వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బందితో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది.
జనవరి 11 (శనివారం)నజరిగిన సమావేశంలో జేఎసీ చైర్మన్‌గా డాక్టర్ బొంగు రమేశ్, కన్వీనర్‌గా డాక్టర్ పుట్ల శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. ఈ కమిటీలో వైద్యారోగ్య శాఖలోని పలు సంఘాలు, యూనియన్లు అంతర్భాగంగా ఉంటాయని జేఏసీ నేతలు తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. రేషనలైజేషన్ పేరిట ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేయడం ఆపాలని, ఖాళీలను భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు.
Published date : 13 Jan 2020 03:51PM