ఉన్నత విద్యలో సంస్కరణలు: ఆదిమూలపు సురేశ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావిధానంలో ప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.
‘ఇలుమినొ’ పేరిట రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన ఇ–బులెటిన్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజినీరింగ్, సంప్రదాయ డిగ్రీ కోర్సుల సిలబస్‌లో మార్పులు, ఆన్‌లైన్ అడ్మిషన్లు, ఉన్నత విద్యాసంస్థల్లో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్స్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినట్టు వివరించారు.
Published date : 14 Apr 2021 03:42PM