ఉద్యాన కళాశాలలో మౌలికసదుపాయాలకు రూ.25 కోట్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చినలతరపి ఉద్యాన కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది.
వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.9.50 కోట్లతో అకడమిక్ బ్లాక్, రూ.4 కోట్లతో బాలుర వసతి గృహాలు, రూ. 6.20 కోట్లతో బాలికల వసతి గృహాలు, రూ.2.40 కోట్లతో కాంపౌండ్ వాల్, గేటు నిర్మించనున్నారు. అలాగే మంచినీటి సరఫరా కోసం రూ.70 లక్షలు, ల్యాండ్ డెవలప్‌మెంట్ తదితరాల కోసం కోటి రూపాయలు, విద్యుదీకరణ కోసం రూ.60 లక్షలు, క్రీడా సౌకర్యాల కోసం మరో రూ.60 లక్షలు ఖర్చు చేయనున్నారు.
Published date : 27 Apr 2021 04:45PM