TS CPGET Application Form Correction: సీపీజీఈటీ–2021 దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకోండి
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ–2021) ఆన్‌లైన్ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి సోమవారం వెల్లడించా రు. దాదాపు 300 మంది అభ్యర్థులు అక్షర దోషాలు, ఫోన్‌నంబర్, చిరునామా అంశాల్లో తప్పులు చేయడంతోపాటు అర్హత లేని కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తులను సరిదిద్దని పక్షంలో వారికి హాల్‌టికెట్లు జారీ చేయబోమన్నారు. వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Published date : 31 Aug 2021 03:45PM