Skip to main content

టీచర్ల బదిలీలకు కొత్త షెడ్యూల్ విడుదల: నవంబర్ 28, 29 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన...

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ బుధవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రక్రియలు ఇలా ఉన్నాయి.

తాజా షెడ్యూల్ ఇదే...

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 28- 29
  • ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్: నవంబర్ 30, డిసెంబర్ 2
  • ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ: డిసెంబర్ 3- 4
  • అభ్యంతరాల పరిష్కారం: డిసెంబర్ 5-7
  • తుది సీనియారిటీ జాబితా: డిసెంబర్ 8-10
  • ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్లు: డిసెంబర్ 11-15
  • అలాట్‌మెంట్ ప్లేస్‌ల జాబితా: డిసెంబర్ 16-21
  • సాంకేతిక సమస్యల పరిష్కారం: డిసెంబర్ 22-23
  • వెబ్‌సైట్ ద్వారా బదిలీ ఉత్తర్వుల విడుదల, డౌన్‌లోడ్: డిసెంబర్ 24
Published date : 26 Nov 2020 01:26PM

Photo Stories