టీచర్ల బదిలీ నిబంధనల్లో మార్పులు: విద్యా శాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీచర్ల బదిలీల నిబంధనలకు సంబంధించి పలు సవరణలు చేస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో ఇటీవల టీచర్ల సంఘాలతో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవో ఇచ్చారు. తాజా సవరణల ప్రకారం 2019-20 సంవత్సరాంతానికి ఒకే స్కూల్‌లో వరుసగా 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ, ఒకే స్కూల్‌లో 2020 అక్టోబర్ 1 నాటికి వరుసగా ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన హెడ్మాస్టర్లకు తప్పనిసరి బదిలీ వంటి పలు సవరణలు చేశారు.
Published date : 25 Nov 2020 03:46PM