టీచర్ పోస్టులనే అప్గ్రేడ్ చేస్తారా.. కొత్తగా ప్రధానోపాధ్యాయ పోస్టులు సృష్టిస్తారా?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా ప్రధానోపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం సృష్టిస్తుందా? లేదా ఉన్న టీచర్ పోస్టులనే అప్గ్రేడ్ చేస్తుందా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ఆయా పోస్టుల కోసం ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు ఎదురు చూస్తున్నారు. అవి వస్తే తమకు హెడ్మాస్టర్గా పదోన్నతి లభిస్తుందన్న ఆశతో టీచర్లు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఆయా పోస్టుల విషయంలో స్పష్టత వచ్చే వరకు ఇతర కేటగిరీల పోస్టుల్లోనూ పదోన్నతులు చేపట్టే అవకాశాలు కనిపించట్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచి్చన హామీ మేరకు ప్రాథమిక పాఠశాలల్లో 10 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులకు అనుమతి ఇచ్చాకే పదోన్నతులు చేపట్టే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టిస్తుందా? లేక ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులనే అప్గ్రేడ్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఉన్న 4,429లో ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులను ఆ 10 వేల పోస్టుల నుంచి మినహాయిస్తుందా.. అవి అలాగే ఉండగా, అదనంగా 10 వేల పోస్టులను కొత్తగా కేటాయిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకు ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.
ఇతర శాఖల్లో పదోన్నతులు కల్పించినా..
రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దాంతో కొన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించారు. అయితే విద్యా శాఖలో మాత్రం పదోన్నతులు ఇవ్వలేదు. అయితే ఇటీవల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని విద్యా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పదోన్నతుల కోసం విద్యా శాఖ కసరత్తు చేసింది. అయితే ఆ తర్వాత సీఎం కేసీఆర్ పీఎస్హెచ్ఎం పోస్టులు ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు విద్యా శాఖ కొత్త పోస్టుల సృష్టి కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరి ఆర్థిక శాఖ కొత్త పోస్టులను సృష్టించి అనుమతిస్తుందా..? ఉన్న పోస్టులనే అప్గ్రేడ్ చేసేందుకు అనుమతిస్తుందా? ఇస్తే ఎన్ని పోస్టులకు అనుమతిస్తుందనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులను అప్గ్రేడ్ చేస్తే వాటిల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తారు. ఆ మేరకు ఎస్జీటీ పోస్టులు తగ్గిపోతాయి కాబట్టి తగ్గిన మేరకు ఎస్జీటీ పోస్టులను సృష్టించి, టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) ద్వారా భర్తీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కొత్తగా పీఎస్హెచ్ఎం పోస్టులను సృష్టిస్తే వాటిల్లో ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన ఎస్జీటీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అర్హులైన ఎస్జీటీలకు పీఎస్హెచ్ఎం పోస్టుల్లో పదోన్నతులు పొందిన వారు పోగా, మిగతా వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. స్కూల్ అసిస్టెంట్లకు హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. అయితే ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, పండిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఈటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ నుంచి హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టుల్లో దాదాపు 15 వేల మందికి పదోన్నతులు ఇవ్వొచ్చని విద్యా శాఖ అంచనా వేసింది. వాటికి పీఎస్హెచ్ఎం పోస్టులు కలిస్తే 20 వేల మందికిపైగా టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. అయితే పీఎస్హెచ్ఎం పోస్టులు ఎన్ని ఇస్తారన్న దానిపై స్పష్టత వచ్చాకే పదోన్నతులపై ముందుకెళ్లే అవకాశం ఉందని, పదోన్నతుల సంఖ్యపైనా స్పష్టత వస్తుందని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
4,429 స్కూళ్లలోనే హెచ్ఎం పోస్టులు..
తెలంగాణ రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 18,217 ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,429 ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులు ఉన్నాయి. అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సృష్టించినవే. ఇంకా 13,788 ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టులే లేవు. ఉన్న పోస్టుల్లోనూ ప్రస్తుతం 2,386 మంది ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు మాత్రమే పని చేస్తున్నారు. మంజూరైన పోస్టుల్లో ప్రస్తుతం ఉన్న హెచ్ఎంలు పోగా మిగతా 2,043 పోస్టుల్లో ఎస్జీలకు హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. మరోవైపు ఇటీవల సీఎం కేసీఆర్ 10 వేల పీఎస్హెచ్ఎం పోస్టులను ఇస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 4,429 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు పోగా, మరో 5,571 పోస్టులను సృష్టించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పోస్టులను కొత్తగా సృష్టిస్తారా? లేదా ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న టీచర్ పోస్టుల్లో ఒక దాన్ని పీఎస్హెచ్ఎం అప్గ్రేడ్ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. విద్యా శాఖ మాత్రం కొత్త పోస్టుల సృష్టికే ప్రతిపాదనలు పంపింది. మరోవైపు ఇప్పుడున్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు కాకుండా అదనంగా 10 వేల పోస్టులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Published date : 28 Apr 2021 03:11PM