Skip to main content

తెలంగాణ ఆర్‌జేసీసెట్‌–21 అర్హుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ ప్రవేశాల కోసం ఆర్‌జేసీసెట్‌–21కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హత కల్పిస్తూ రూపొందించిన ప్రాథమిక జాబితాను బుధవారం విడుదల చేశారు.
ఈ జాబితా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీలోపు హాల్‌టికెట్, కుల ధ్రువీకరణ, బదిలీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ, పాస్‌ఫొటోలు తదితర ధ్రువపత్రాలతో ఎంపికైన కాలేజీలో రిపోర్టు చేయాలని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రిపోర్టు చేయకుంటే ఆ విద్యార్థి అనర్హుడవుతారని స్పష్టంచేశారు.
Published date : 24 Jun 2021 05:12PM

Photo Stories