‘టైమ్స్’ ర్యాంకింగ్స్‌లో ఏఎన్‌యూకు స్థానం
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ బుధవారం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఇంపాక్ట్ ర్యాంకింగ్స్–2021ను ప్రకటించింది.
ఈ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 1115 వర్సిటీలకు స్థానం దక్కగా ఏఎన్‌యూ 601–800 కేటగిరీలో స్థానం దక్కించుకుంది. జాతీయస్థాయిలో 49 వర్సిటీలు ర్యాంకులు పొందగా ఏఎన్‌యూ 16వ ర్యాంకును పొందింది. రాష్ట్ర స్థాయిలో నాలుగు వర్సిటీలు ర్యాంకులు పొందగా అందులో ఏఎన్‌యూ తొలి స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ వర్సిటీలకు ఈ ర్యాంకులు కేటాయించింది.
Published date : 22 Apr 2021 07:04PM