‘టైమ్స్’ ర్యాంకింగ్స్‌లో ఏఎన్‌యూకు అగ్రస్థానం
Sakshi Education
సాక్షి, అమరావతి బ్యూరో: వర్సిటీల కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
లండన్‌కి చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ 2020కి గాను ప్రపంచస్థాయిలో వర్సిటీలకు ఇంపాక్ట్ ర్యాంకింగ్‌సను ఏప్రిల్ 22న విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌సకు 85 దేశాల నుంచి 766 వర్సిటీలు ఎంపికవగా ఏఎన్‌యూ 401-600 విభాగంలో ర్యాంకును సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఏఎన్‌యూ సాధించిన ర్యాంకుల కంటే ఇది అత్యుత్తమం. ఈ ఓవరాల్ ర్యాంకును ఏపీలో మూడు వర్సిటీలు పొందగా వాటిలో ఏఎన్‌యూ మొదటి స్థానంలో ఉంది.
Published date : 23 Apr 2020 03:54PM