Skip to main content

సంపూర్ణ విజ్ఞానం కోసమే "వుయ్ లవ్ రీడింగ్".. ఆదిమూలపు సురేష్

సాక్షి, అమరావతి బ్యూరో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడం, చదువులోని ఆనందాన్ని పరిచయం చేయడానికే ‘చదవటం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలూ చదివితేనే సంపూర్ణ విజ్ఞానం లభిస్తుందన్నారు. గురువారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటుచేసిన చదవటం మాకిష్టం (వుయ్ లవ్ రీడింగ్) కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరితతో కలసి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదవటం మాకిష్టం’ లోగో, కరపత్రాలు, గీతాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు ఉద్యమంలా తీసుకెళ్తామని సురేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటిని అనుసంధానిస్తూ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీగా నామకరణం చేస్తామని తెలిపారు.

హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ..
ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. వాటిని ప్రతి విద్యార్థీ తెలుసుకోవాలన్నారు. కాగా, ఇదే వేదికపై రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు.
Published date : 27 Nov 2020 01:50PM

Photo Stories