సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ డిసెంబర్ 31న విడుదల
Sakshi Education
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్‌నుడిసెంబర్31వ తేదీన ప్రకటిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు.
ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. సాధారణంగా సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలను జనవరిలో నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే థియరీ పరీక్షలు మార్చిలో ముగుస్తాయి. ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Published date : 28 Dec 2020 02:42PM