సెప్టెంబర్ 15 నుంచి డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు: ఉస్మానియా యూనివర్సిటీ
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో సెప్టెంబర్ 15 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలతో పాటు ఇతర కోర్సుల ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంక టేశ్ శనివారం తెలిపారు.
యూజీసీ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు ఫీజులు చెల్లించని విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఈ నెల 31 నుంచి ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ ఇయర్ వైజ్ స్కీమ్ విద్యార్థులు, ఇంతవరకు పరీక్ష ఫీజు చెల్లించని రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులు కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను (https://www.osmania.ac.in/) చూడాలని సూచించారు.
Published date : 31 Aug 2020 05:12PM