‘సాక్షి’ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ... ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి..
Sakshi Education
హైదరాబాద్: ఇంగ్లిష్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న భాష. ఈ సువిశాల ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అక్కడివారితో సంభాషించేందుకు ఈ భాష పనికొస్తుంది.
ప్రస్తుత సాంకేతిక యుగంలో అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇంగ్లిష్! ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన భాషలో మీరు ఎలాంటి బెరుకు లేకుండా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణనిచ్చేందుకు సాక్షి ముందుకు వచ్చింది. ఈ మేరకు English Communication Skills ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనుంది. ఈ ఆన్‌లైన్ క్లాసులకు ఎవరైనా, ఎక్కడినుంచైనా హాజరై తమ ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న నిపుణులచే వినూత్న పద్ధతిలో శిక్షణ ఉంటుంది. ఈ నిపుణులు ముఖ్యంగా లిజనింగ్ స్కిల్స్, ఉచ్ఛారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతో పాటు వ్యాకరణాంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరికి ఇదో సువర్ణావకాశం. ఈ కోర్సు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి ఈ కోర్సు ఒక చక్కని చుక్కానిలా ఉపయోగపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇప్పుడే మీ పేరును నమోదు చేసుకోండి. మీ విలువైన సమయాన్ని సది్వనియోగం చేసుకోండి. మీ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోండి.
కోర్సు వివరాలు..
కోర్సు వివరాలు..
- కోర్సు వ్యవధి: 30 రోజులు, 45 గంటలు
- బ్యాచ్ ప్రారంభ తేదీ: 21–6–2021
- ఉదయం బ్యాచ్: 07:00 AM నుంచి 8:30 AM వరకు
- సాయంత్రం బ్యాచ్: 05:00 PM నుంచి 6:30 PM వరకు
- కోర్సు ఫీజు: రూ. 3,500/– మాత్రమే
- ఈ వెబ్‌సైట్ ద్వారా www.arenaone.in/events/ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- మరిన్ని వివరాలకు 99126 71555, 96660 13544, 96666 97219, 95055 14424, 96662 83534 నంబర్లపై సంప్రదించండి.
Published date : 16 Jun 2021 05:48PM