Skip to main content

రూ.4,456 కోట్లతో 16,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనబడి నాడు–నేడు పథకం రెండో దశలో రూ.4,456 కోట్లతో 16,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
ఏ విద్యార్థి చదువు మానకూడదు అన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి చెప్పారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సురేష్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 అమలులో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో 45వేలకు పైగా పాఠశాలలు ఉండగా నాడు–నేడు తొలివిడతలో 15,715 పాఠశాలను అభివృద్ధి పరిచామని వివరించారు.

చ‌ద‌వండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాతంగా అగ్రికల్చర్‌ ఎంసెట్‌.. 90 శాతంపైగా హాజరు

చ‌ద‌వండి: జాతీయ స్థాయిలో కాలేజీలు, సీట్లు, చేరికలు ఏటా తగ్గుముఖం.. ఏపీలో మాత్రం ఇలా..

చ‌ద‌వండి: ఏపీలో గిరిజన వర్సిటీ స్థాపనకు చర్యలు: ధర్మేంద్ర ప్రదాన్‌
Published date : 11 Aug 2021 01:48PM

Photo Stories