ఫిబ్రవరి 25నడిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలా ఉండగా అసిస్టెంటు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు సంబంధించి ఎంపికై న అభ్యర్థులకు మార్చి 2వ తేదీన విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ఆయన మరో ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 19 Feb 2021 03:12PM