ఫిబ్రవరి 1 నుంచి అంగన్‌వాడీ స్కూళ్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 1 నుంచి అంగన్‌వాడీ స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ డాక్టర్ కృతిక శుక్ల బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, 3-6 ఏళ్ల లోపు పిల్లలకు పాలు ఇవ్వాలని ఆదేశించారు. గిరిజన గ్రామాల్లోని అంగన్‌వాడీ సెంటర్‌లలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా అందించే పదార్థాలు అందిస్తారని తెలిపారు. బాలామృతం, కోడి గుడ్లు, పాలు యథావిధిగా పిల్లలకు ఇవ్వాలని, 65 ఏళ్లు పైబడిన వారు స్కూళ్లకు రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Published date : 28 Jan 2021 02:54PM