ఫార్మా రంగంలో నైపుణ్య శిక్షణ
Sakshi Education
హైదరాబాద్: ఫార్మా కంపెనీలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మియాపూర్‌లోని ఫార్మా పాఠశాల నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.వి.వి. సత్యనారాయణ జనవరి 25 (శనివారం)నప్రకటనలో తెలిపారు.
తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్‌జ (టీఏఎస్‌కే) సహాయంతో ఫీజు రాయితీ కల్పిస్తోందన్నారు. రెండు నెలలో పార్మా రంగాల్లో పనిచేయడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి పార్మా కంపెనీల్లో క్యూ సీ, క్యూ ఏ, ఆర్‌అండ్‌డీ, ఏఆర్ అండ్ డీ డిపార్ట్‌మెంట్‌లలో అవకాశాలు ఉంటాయన్నారు. దీని కోసం 2017, 2018, 2019లలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీలలో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న వారికి ఫీజులో 40 శాతం, టీఏఎస్‌కేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 50 శాతం, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి 60 శాతం ఫీజులో రాయితీ కల్పిస్తారు. ఫార్మా రంగంలో నైపుణ్య శిక్షణ తరగతులు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1 లోపు సర్టిఫికెట్లతో పాటు మూడు పాస్‌సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డులతో ఫార్మా పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మియాపూర్ ఫార్మా పాఠశాల లేదా 040- 40125050, 99491 97755, 96521 97755లలో సంప్రదించవచ్చు.
Published date : 27 Jan 2020 01:11PM