ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యార్థుల హాజరు శాతం
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నందువల్ల విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 2వ తేదీన పాఠశాలలు తెరవగా 10వ తేదీ నాటికి క్రమేణా హాజరు శాతం పెరుగుతున్నదని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు 52.17 శాతం, 9వ తరగతి 35.22 శాతం, 90 శాతం మంది ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరయ్యారని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థుల హాజరు శాతం 35.69 ఉండగా, డిగ్రీ సెకండియర్ 31.33, థర్డ్ ఇయర్ 38.78 శాతం హాజరయ్యారన్నారు. మొత్తంగా హాజరు 43.71%కి చేరిందని పేర్కొన్నారు.
Published date : 11 Nov 2020 01:47PM