ప్రైమరీ స్కూల్ టీచర్లు రోజూ రావాల్సిందే..: పాఠశాల విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రోజు విడిచి రోజు స్కూలుకు వచ్చే ప్రాథమిక పాఠశాలలకు చెందిన టీచర్లంతా ఈ నెల 3 నుంచి ప్రతిరోజూ రావాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అవసరమైన చోట ప్రాథమిక పాఠశాలల టీచర్ల సేవలను వినియోగించుకునేలా డీఈవోలు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులను ప్రారంభించిన సమయంలో ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్ల సేవలను ఉన్నత పాఠశాలల్లో వినియోగించుకునేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల టీచర్ల సేవలను ఇకపై అవసరమైన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వినియోగించుకోనుంది.
Published date : 03 Mar 2021 05:41PM