పకడ్బందీగా పరీక్షల నిర్వహణ: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు
సచివాలయంలోని తన కార్యాలయంలో టెన్‌త, ఇంటర్ పరీక్షల నిర్వహణ సహా వివిధ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు కింద కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు ట్రెజరీలు, పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్న కేంద్రాలు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల లొకేషన్ విద్యార్థులకు తెలిసేలా యాప్‌ను అందుబాటులో ఉంచాలన్నారు.
Published date : 25 Feb 2020 01:45PM