Skip to main content

పీజీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు అక్టోబర్29 వరకు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ. కిషన్ సోమవారం తెలిపారు.
అపరాధ రుసుము లేకుండా ఈ నెల 23 వరకు, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 29 వరకు, రూ.2వేల అపరాధ రుసుముతో నవం బర్ 2 వరకు గడువు పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 19తో దరఖాస్తు స్వీక రణ గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు నవంబర్ 6 నుంచి 18 వరకు జరుగుతాయన్నారు.
Published date : 20 Oct 2020 06:07PM

Photo Stories