పాఠ్యాంశంగా ఇటుకల పండుగ
Sakshi Education
పాడేరు: గిరిజనుల సంప్రదాయ ‘ఇటుకల పండుగ’కు ఐదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చోటు కల్పించారు.
పంటలు బాగా పండాలని, అన్ని జీవులు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ దేవత శంఖు దేవుడికి పూజలు చేస్తూ గిరిజనులు ప్రతి ఏడాదీ చైత్ర మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. గిరిజనుల ప్రధాన పండుగల్లో ఇది ముఖ్యమైనది. విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు సరిహద్దులోని ఒడిశా గ్రామాల్లో కూడా దీన్ని పాటిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న తమ పండుగను పాఠ్యాంశంగా చేర్చడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 21 Oct 2020 01:53PM