పాఠశాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యార్థుల హాజరు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం తరువాత విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం మొత్తంగా 72 శాతానికి చేరిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 83 శాతం విజయనగరం, చిత్తూరు, కడపలో 80 శాతం నమోదైనట్లు తెలిపారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 67 నుంచి 70 శాతం మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
Published date : 24 Aug 2021 03:27PM