Skip to main content

నవంబర్ 6 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు..దరఖాస్తు చేసుకొని వారికి చివరి తేదీ ఇదే

ఉస్మానియా యూనివర్సిటీ: పీజీ ప్రవేశ పరీక్షలు నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
ఈ విద్యా సంవత్సరానికి తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 6 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ-2020 కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులో తప్పులను అక్టోబర్ 29 వరకు (గురువారం) ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంతవరకు దరఖాస్తు చేసుకొని విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో అక్టోబర్ 29వ తేదీ వరకు, రూ.2,000తో నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Published date : 29 Oct 2020 04:20PM

Photo Stories