నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ సీట్లకు మాప్‌అప్ కౌన్సెలింగ్: కాళోజీ హెల్త్ వర్సిటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్‌అప్ కౌన్సెలింగ్‌కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కళాశాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో నిర్దేశిత గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం రాత్రి 7 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని సూచించింది. మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపింది.
Published date : 07 Apr 2021 05:32PM