నేటి నుంచి జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో బీఈ/బీటెక్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
మూడురోజుల పాటు ఈ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచ్‌లర్ ఆఫ్ ప్లానింగ్‌లలో (బీప్లానింగ్) ప్రవేశాలకు మంగళవారం జేఈఈ మెయిన్ పేపర్–2 పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 63 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అంచనావేసింది. వారిలో తెలంగాణ నుంచి 4 వేల మంది వరకు విద్యార్థులు హాజరైనట్లు ఎన్‌టీఏ వర్గాలు పేర్కొన్నాయి.
Published date : 24 Feb 2021 05:46PM