నాడు–నేడుతో పాత (బడి)కి మెరుగులు
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్: నాడు–నేడు రెండో దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలోని 1,671 పాఠశాలలు, భవిత సెంటర్లు, బీసీ, ఎస్సీ, మండల్ రిసోర్స్ సెంటర్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డైట్ కళాశాల పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతి లభించింది. మొదటి దశ నాడు–నేడు పనులకు రూ.315.21 కోట్లు వెచ్చించనుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
నాడు–నేడు మొదటి దశ పనులు
జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ప్రాథమిక పాఠశాలలు 954, ప్రాథమికోన్నత పాఠశాలలు 290, ఉన్నత పాఠశాలలు 289 మొత్తం 1,533 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులను చేపట్టారు. బడుల రూపురేఖలను పూర్తిగా మార్చారు.
రెండో దశకు ఎంపికైన బడులు
జిల్లా వ్యాప్తంగా రెండో దశ నాడు– నేడు పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలు 837, ప్రాథమికోన్నత పాఠశాలలు 112, ఉన్నత పాఠశాలలు 364, భవిత సెంటర్లు 39, బీసీ హాస్టళ్లు 63, ఎస్సీ హాస్టళ్లు 109, మండల రిసోర్స్ సెంటర్లు 66, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 61, డైట్ కళాశాల 1, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 4, బీసీ రెసిడెన్సియల్ స్కూల్స్ 3, రెసిడెన్షియల్ స్కూల్ 1, ట్రైబల్ వెల్ఫేల్ హాస్టల్స్ 4, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు 2, ఇతర సంస్థలు 5 మొత్తం 1,671 విద్యాసంస్థలను ఎంపిక చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. సర‘కారు’బడుల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో మొదటి దశ పనులు పూర్తిచేసి తల్లిదండ్రుల చేత శభాష్ అనిపించుకుంది. విపక్ష నాయకులు సైతం వసతులను చూసి ముక్కున వేలు వేసుకునేలా ఔరా అనిపించింది. ఇప్పుడు రెండో దశలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రణాళిక రచించింది. కార్పొరేట్ తలదన్నేలా.. ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సంకల్పించింది. నాడు–నేడు రెండో దశపై –‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..
మెరిసే..మురిసే
జిల్లా వ్యాప్తంగా 1,533 బడుల్లో అధికారులు మొదటి దశ నాడు–నేడు పనులు చేపట్టారు. శిథిలావస్థకు చేరిన బడుల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. నూతన నిర్మాణాలు, మరమ్మతులు, ఫర్నిచర్ ఏర్పాటు తదితర పనులు చేపట్టారు. ప్రాధాన్యత గల పనులను చేపట్టి వసతులు కల్పించారు. గతంలో ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే పొటోలు తీయించి ప్రజలకు చూపించారు. ప్రైవేట్ పాఠశాలలకన్నా మెరుగ్గా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించారు. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు మరింత నమ్మకాన్ని పెంచారు.
సదుపాయాలు ఇలా..

- ప్రతి పాఠశాలలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, పాఠశాల ప్రాంగణాలకి ప్రహరీ గోడలు, తరగతి గదుల మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ చాక్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్
- మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్, విద్యుత్ పనులు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు, టీచర్లకు ఫర్నిచర్, పాఠశాల ప్రాంగణం మొత్తం పెయింటింగ్, మేజర్, మైనర్ రిపేర్స్, కిచెన్ షెడ్స్ ఏర్పాటు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తరగతి గదుల్లో గ్రానైట్ వేయించడం
- పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ
నాడు–నేడు మొదటి దశ పనులు
జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ప్రాథమిక పాఠశాలలు 954, ప్రాథమికోన్నత పాఠశాలలు 290, ఉన్నత పాఠశాలలు 289 మొత్తం 1,533 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులను చేపట్టారు. బడుల రూపురేఖలను పూర్తిగా మార్చారు.
రెండో దశకు ఎంపికైన బడులు
జిల్లా వ్యాప్తంగా రెండో దశ నాడు– నేడు పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలు 837, ప్రాథమికోన్నత పాఠశాలలు 112, ఉన్నత పాఠశాలలు 364, భవిత సెంటర్లు 39, బీసీ హాస్టళ్లు 63, ఎస్సీ హాస్టళ్లు 109, మండల రిసోర్స్ సెంటర్లు 66, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 61, డైట్ కళాశాల 1, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 4, బీసీ రెసిడెన్సియల్ స్కూల్స్ 3, రెసిడెన్షియల్ స్కూల్ 1, ట్రైబల్ వెల్ఫేల్ హాస్టల్స్ 4, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు 2, ఇతర సంస్థలు 5 మొత్తం 1,671 విద్యాసంస్థలను ఎంపిక చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. సర‘కారు’బడుల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో మొదటి దశ పనులు పూర్తిచేసి తల్లిదండ్రుల చేత శభాష్ అనిపించుకుంది. విపక్ష నాయకులు సైతం వసతులను చూసి ముక్కున వేలు వేసుకునేలా ఔరా అనిపించింది. ఇప్పుడు రెండో దశలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రణాళిక రచించింది. కార్పొరేట్ తలదన్నేలా.. ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సంకల్పించింది. నాడు–నేడు రెండో దశపై –‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..
Published date : 26 Apr 2021 05:00PM