నాడు-నేడు తొలి దశ పనులు ఫిబ్రవరి 28లోగా పూర్తిచేయాల్సిందే: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాడు-నేడు కార్యక్రమంలో తొలి దశ స్కూళ్ల అభివృద్ధి పనులను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
నాడు-నేడు పనులపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పెయింటింగ్ పనులు ఫిబ్రవరి 20 నాటికి పూర్తిచేయాలని, వీటి పురోగతిపై 29న మరోసారి సమీక్షిస్తామని చెప్పారు. సంతృప్తికర స్థాయిలో పనులు జరగకుంటే సంబంధీకులపై పెనాల్టీ ఉంటుందని హెచ్చరించారు. అల్మారాలు, స్మార్ట్ టీవీ పనులను ఫిబ్రవరి 20, గ్రీన్‌బోర్డులు, మంచినీటి సదుపాయం తదితర పనులను ఫిబ్రవరి 25 నాటికి పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.
Published date : 23 Jan 2021 04:42PM