Skip to main content

మా లాంటి పేదోళ్లకు...మీ ఇచ్చే గొప్ప వరం ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం


సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రుల మనోగతాలు ఇలా ఉన్నాయి...

మీ పథకాలే మాకు అండ :
మీరు ప్రవేశ పెట్టిన పథకాలు మా కుటుంబాలను కాపాడుతున్నాయి. మా అమ్మాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల మేలు జరుగుతుంది. జగనన్న మమ్మల్ని దీవిస్తారులే అని మా అమ్మాయి చెబుతూ ఉంటుంది. మహిళల పట్ల మీకు అమితమైన గౌరవం ఉంది. మీరు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, గోరుముద్ద కూడా చాలా మంచి పథకాలు.
- పద్మావతి, విద్యార్థిని తల్లి, విశాఖపట్నం

మిగతా రా్ర్టాలకు ఆదర్శం..
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులను పాదయాత్రలో మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరు స్పష్టమైన హామీ ఇచ్చారు. కరోనా లాంటి సమయంలో కూడా మీరు ధైర్యం చేసి ఇంత పెద్ద మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇస్తున్నారు. విద్యకు మీరు ఇచ్చే ప్రాధాన్యత దీని ద్వారా తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయక పోవడం వల్ల చాలా కాలేజీలు మూతబడే పరిస్థితి. స్కిల్ డెవలప్‌మెంట్ రూపంలో కూడా మీరు కొత్త సంస్కరణలు తీసుకు వస్తున్నారు.
- ఉమాశంకర్‌రెడ్డి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి, గుంటూరు


ఇక మేమూ కలలు కంటాం...
కొత్తవలసలో డిగ్రీ చదువుతున్నాను. విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా నేను లబ్ధి పొందుతున్నాను. నేను కూడా రైతు బిడ్డనే. బడుగు, బలహీన వర్గాల వారు కలలు కనవచ్చు అని మాకు నమ్మకం వచ్చింది. మా బాగు కోరి, తల్లి అకౌంట్‌లో ఈ డబ్బులు వేయడం మంచి ఆలోచన. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఎవ్వరూ ప్రశ్నించకపోయినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యార్థులకు మేలు చేశారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలతో పాటు విద్యా రంగానికీ చక్కటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
- మౌనిక, విద్యార్థిని, కొత్తవలస, విజయనగరం జిల్లా


కాలేజీ వాళ్లతో మాట్లాడే ధైర్యం వచ్చింది..
నాకు ఇద్దరు పిల్లలు. పెద బాబు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వసతి దీవెన డబ్బులు వచ్చాయి. విద్యా దీవెన డబ్బులు కూడా నా అకౌంట్లో ఇప్పుడు పడతాయి. ఒక తల్లిగా కాలేజీకి వెళ్లి.. మా అబ్బాయి చదువుల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. కాలేజీ వాళ్లతో మాట్లాడే ధైర్యం వచ్చింది. మీరు ముఖ్యమంత్రిగా కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- ఫరీదా బేగం, విద్యార్థి తల్లి, చిత్తూరు జిల్లా

మాకు భరోసా కల్పించారు..
వైఎస్సార్ బాటలో నడుస్తున్న మీరు విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మాకు భరోసాను ఇస్తున్నాయి. కరోనా లాంటి సమయంలో, ఆర్థిక సంక్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే.. మీరు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వడం గొప్ప విషయం. విద్యా రంగం అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం.
- ప్రియాంక, విద్యార్థిని, కడప

మాకంటే ముందు మీరే స్పందిస్తున్నారు..
మా అమ్మ టైలర్. అమ్మా, నాన్న కష్టపడితేనే కానీ మాకు పూట గడవదు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మాలో ఆనందం నింపింది. గతంలో ఫీజు కింద ప్రభుత్వం కొంత ఇస్తే, మిగతా డబ్బును అప్పు చేసి కట్టే వాళ్లం. దీంతో చాలా ఇబ్బందులు పడే వాళ్లం. వసతి దీవెన, విద్యా దీవెనలతో మాకు చాలా లబ్ధి చేకూరింది. మాకు ఏం కావాలన్నా.. మా కన్నా ముందు మీరే స్పందించి ఇస్తున్నారు.
- చైతన్య, విద్యార్థిని, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా

మా పిల్లలందరికీ మీ వల్లే మేలు...
మా కుటుంబాల్లో ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. మాకు ముగ్గురు పిల్లలు. నా భర్త వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు పూర్తిగా బెడ్ రెస్ట్. చాలా ఇబ్బందులు పడ్డాను. ట్యూషన్లు చెబుతూ నెట్టుకొస్తున్నా. నేను ఏడవని రోజు లేదు. ఇప్పుడు నా పిల్లలు అందరికీ మీ వల్ల మేలు జరుగుతుంది. కరోనా వంటి ఆపద సమయంలో కూడా వలంటీర్లు ఇంటింటికీ వస్తున్నారు. రూ. 1,000 ఇచ్చారు. ఇందుకు మీకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.. మీరు కాల్ సెంటర్ పెట్టి నంబర్ కూడా ఇచ్చారు కాబట్టి, ఇక ఏ సమస్యలూ ఉండవు.
- రత్నకుమారి, విద్యార్థిని (అపర్ణ) తల్లి, విజయవాడ


మా లాంటి పేదోళ్లకు వరం..
మాకు ఏడాదికి రూ.60 వేల ఆదాయం మాత్రమే ఉంది. నేను చదువుకోవాలంటే ఎన్నో సమస్యలు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలతో నేను బాగా చదువుకోగలుగుతున్నాను. మీరు మాకు ఎంతో భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని చాలా గట్టిగా కోరుతున్నాం. మీరు ఇచ్చే వసతి దీవెన కూడా మాకు వచ్చింది. మా వంటి పేద కుటుంబాలకు చాలా సహాయం లభిస్తోంది.
- జీవిత, డిగ్రీ విద్యార్థిని, శ్రీకాకుళం


సీఎం నూరేళ్లు చల్లగా ఉండాలి..
తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని, వారి పిల్లల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి. 2018లో ప్రజాసంకల్ప యాత్ర మా ఉరు వచ్చినప్పుడు మా ఆవేదనను ఆయనకు చెప్పుకున్నాం. అప్పుడే మాకు ఒక మాట చెప్పారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు వచ్చిన కష్టం ఏ తల్లిదండ్రులకూ రానివ్వనమ్మా.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే ఇచ్చి పిల్లల్ని గొప్పగొప్ప చదువులు చదువుకునేలా చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాటను మర్చిపోకుండా చేసి చూపారు. అందరి భవిష్యత్తుకు మేలు జరిగేలా సీఎం చూడడం మాకు ఎంతో ఆనందం వేసింది.
- అంకమ్మరావు తల్లి వరమ్మ


ఏ తల్లిదండ్రికీ కడుపు కోత ఉండదు...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన అంకమ్మ రావు 2016లో ఇంజినీరింగ్‌లో చేరాడు. ఇష్టమైన మెకానికల్ గ్రూపు ఎంచుకున్నాడు. ఫీజు కోసం తండ్రి పడుతున్న కష్టాలు చూశాడు. తల్లడిల్లిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. 2018 ఫిబ్రవరి 14న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడుములదిన్నె గ్రామం మీదుగా సాగింది. గోపాల్ ఇంటి ముందు అంకమ్మరావు ఫొటోను జగన్ చూశారు. ఏమైందన్నా అని గోపాల్‌ను ప్రశ్నించారు. ఫీజు కట్టలేక తమ బిడ్డ ఎలా బలైపోయిందీ వివరించి గోపాల్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మనం అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూస్తానని ఆయన వారికి చెప్పారు ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని అంకమ్మరావు తండ్రి గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.
- గోపాల్
Published date : 29 Apr 2020 04:27PM

Photo Stories