ఖరగ్‌పూర్ ఐఐటీ టెక్నో ఫెస్ట్‌కు ఆహ్వాన ం
Sakshi Education
మచిలీపట్నంటౌన్: ఖరగ్‌పూర్ ఐఐటీలో జరిగే ప్రతిష్టాత్మక ‘క్షితిజ్’ టెక్నో మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌కు ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పరిశోధన నమూనాలను ఆహ్వానిస్తున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీ ఫెస్ట్ కమిటీ వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఈ వార్షికోత్సవ టెక్నో మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌ను 17వ ఎడిషన్‌గా 17 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఎంఈసీహెచ్, ఐఈఈఈ వంటి ప్రముఖ జర్నల్స్ ధ్రువీకరించిన 30కి పైగా టాపిక్స్‌పై పరిశోధన నమూనాల పోటీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు క్షితిజ్ వెబ్‌సైట్ ‘కేటీజీ.ఐఎన్’ ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. సాధారణ సమాచారం కోసం క్షితిజ్, ఐఐటీ ఖరగ్‌పూర్ ఫేస్‌బుక్ పేజీని అనుసరించవచ్చునని తెలిపారు. గత ఏడాది దాదాపు 70 వేల మంది క్షితిజ్ ఫెస్ట్‌లో పాల్గొని రూ.45 లక్షల నగదు బహుమతిని పొందారని పేర్కొన్నారు.
Published date : 04 Jan 2020 12:56PM