Skip to main content

కొత్త జోనల్‌కు అనుగుణంగా శాఖల వారీగా త్వరలో నోటిఫికేషన్లు.. పోస్టుల భర్తీ ఈ విధంగానే..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల కింద విభజించింది.
ఈ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఏయే పోస్టులు ఏ కేటగిరీల్లోకి వస్తాయన్న వివరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 ఆగస్టులో జారీచేసిన లోకల్‌ కేడర్‌ వ్యవస్థీకరణ ఉత్తర్వులకు కొనసాగింపుగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం... ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు జిల్లా కేడర్‌ కింద గుర్తించగా.. సీనియర్‌ అసిస్టెంట్, ఆపై పోస్టులు జోనల్‌ కేడర్‌ కింద, జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీజోనల్‌ కేడర్‌ కింద పరిగణించనున్నారు. అయితే కొన్నిశాఖల్లో పక్కపక్క జిల్లాలను, పక్కపక్క జోన్లను కలిపి యూనిట్లుగా ఏర్పాటు చేసి.. పలురకాల పోస్టులను యూనిట్ల పరిధిలోకి తీసుకువచ్చారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజా కేడర్‌ విభజనకు అనుగుణంగా ఆయా శాఖల్లో కేడర్‌ సంఖ్యను నిర్ధారించాలని.. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మేరకు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్‌ ఆదేశించారు.

చ‌ద‌వండి: జగనన్న అమ్మ ఒడి పథకం: అర్హతలు – ప్రయోజనాలు

చ‌ద‌వండి: 6 రకాలుగా స్కూళ్ల వర్గీకరణ... దీనితో 44 వేల నుంచి 58 వేలకు పెరగనున్న స్కూళ్లు..

పలుశాఖల్లో కొన్ని జిల్లాలు యూనిట్‌గా..
పురావస్తు శాఖలో కొన్ని పోస్టులను పక్కపక్కనే ఉన్న జిల్లాలకు కలిపి ఉమ్మడిగా కేటాయించారు. ఈ మేరకు జిల్లాలను యూనిట్లుగా విభజించారు. జూనియర్‌ అసిస్టెంట్లు, ముఖ్య చౌకీదార్, స్వీపర్, ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్, మ్యాన్యుస్క్రిప్ట్‌ మెకానిక్, న్యుమిస్మాటిక్‌ మెకానిక్‌ పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఆ యూనిట్‌ జిల్లాలన్నింటి పరిధిలో ఉమ్మడిగా ఉంటాయి. జిల్లాల యూనిట్లు.. 1.ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు; 2. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల; 3.కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి; 4.కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ (అర్బన్, రూరల్‌); 5.సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ; 6.మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌; 7.మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ శాఖ పరిధిలో సీనియర్‌ అసిస్టెంట్‌ కంటే తక్కువ కేడర్‌ పోస్టులను ప్రస్తుత జిల్లాల కేడర్‌ కింద.. సీనియర్‌ అసిస్టెంట్, కేర్‌టేకర్‌ పోస్టులను జోనల్‌ కేడర్‌ కింద.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌), టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మల్టీజోన్‌ కింద నోటిఫై చేశారు.
  • ఎక్సైజ్‌ శాఖలోనూ పక్కపక్కన జిల్లాలతో కలిపి యూనిట్లుగా పరిగణించనున్నారు. జోనల్‌ పోస్టులైన ఆఫీస్‌ సూపరిండెంట్, అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను పక్కపక్కనే ఉన్న జోన్లతో కలిపి యూనిట్‌గా నోటిఫై చేశారు.
  • తూనికలు–కొలతల శాఖలో కూడా కొన్ని పోస్టులను పక్కపక్కనే ఉన్న జిల్లాలు, పక్కపక్కనే ఉన్న జోన్లను కలిపి యూనిట్లుగా పరిగణించనున్నారు.
  • పోలీసు బెటాలియన్లు, ఐటీ అండ్‌ కమ్యూనికేషన్ల శాఖలో జిల్లా పోస్టులను రెండు కేడర్‌లలో (పక్కపక్కనే ఉన్న జిల్లాలను కలుపుతూ), జోనల్‌ పోస్టులను పక్కపక్క జోన్లు కలిపి యూనిట్లుగా నోటిఫై చేశారు.
  • పర్యాటక శాఖలో టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్, టూరిస్టు గైడ్, కేర్‌టేకర్‌ గైడ్‌–2, వాచ్‌మన్, శానిటరీ వర్కర్, ఆఫీస్‌ సబార్డినేట్, ఆఫీస్‌ బాయ్, కుక్‌ పోస్టులను మాత్రమే జిల్లా కేడర్‌ కింద నోటిఫై చేశారు. ఈ శాఖలో జోనల్, మల్టీజోనల్‌ పోస్టులను నోటిఫై చేయలేదు.
  • యువజన సర్వీసుల శాఖలో సూపరిండెంట్‌ స్థాయి పోస్టులను జోనల్‌ కేడర్‌ వరకే నోటిఫై చేశారు. ఎన్‌సీసీ విభాగం, పరిశ్రమల శాఖలోనూ మల్టీజోనల్‌ పోస్టులను నోటిఫై చేయలేదు.
  • అర్థగణాంక శాఖలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టును మల్టీజోనల్‌ కేడర్‌లో చేర్చారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) వీసీ పరిధిలోనికి వచ్చే పోస్టులను కూడా కేడర్ల వారీగా విభజించారు.
  • జీహెచ్‌ఎంసీ పోస్టులను జోనల్‌ అయితే చారి్మనార్‌ జోన్‌కు, మల్టీజోనల్‌ అయితే రెండో జోన్‌కు మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు.

జిల్లా పోస్టులుగా నోటిఫై చేసిన పలు హోదాలు
జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, సూపర్‌వైజర్, మ్యాట్రన్, బార్బర్, రికార్డ్‌ అసిస్టెంట్, కుక్, ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మన్, స్వీపర్, మాలి, శానిటరీ వర్కర్, ఆయా, ధోబీ, కామాటి, వార్డుబాయ్, స్టోర్‌ కీపర్, అంగన్‌వాడీ ఆయా, నర్సు, స్కిల్డ్‌ అసిస్టెంట్, గోల్డ్‌ స్మిత్, ఈవో గ్రేడ్‌–2, అసిస్టెంట్‌ ఫోర్‌మన్, టైం కీపర్, బిల్‌ కలెక్టర్, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, బోర్‌వెల్‌ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పంప్‌ డ్రైవర్, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్, డార్క్‌రూం/ఎక్స్‌రే/ల్యాబ్‌ అటెండెంట్లు, క్లీనర్, స్ట్రెచ్‌ బేరర్, థియేటర్‌ అసిస్టెంట్, టైలర్, లిఫ్ట్‌ అటెండెంట్, ప్లంబర్, ఫైర్‌మన్, యానిమల్‌ అటెండెంట్‌ తదితర పోస్టులు.
(వైద్య విద్య శాఖలో అత్యధికంగా 145 రకాల పోస్టులను జిల్లా కేడర్‌గా నోటిఫై చేశారు. ఆ శాఖలో జోనల్‌ కేడర్‌లో 136 రకాల పోస్టులు, మల్టీజోనల్‌ కేడర్‌లో 64 రకాల పోస్టులు ఉన్నాయి)

కొన్ని ముఖ్యమైన శాఖల్లో జోనల్, మల్టీజోనల్‌ పరిధిలోనికి వచ్చే పోస్టులివీ..

ప్రభుత్వ శాఖ

జోనల్‌ పరిధి

మల్టీజోనల్‌ పరిధి

1) భాషా సాంస్కృతిక శాఖ

సూపరిండెంట్లు

లెక్చరర్, అసిస్టెంట్‌ లెక్చరర్‌

2) మహిళాశిశు సంక్షేమం

గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లు

సీడీపీవో, ఏసీడీపీవో

3) రోడ్లు భవనాల శాఖ

టెక్నికల్‌ అసిస్టెంట్లు

ఏఈఈ, ఏఈ, డీఏవో

4) రవాణా శాఖ

హెడ్‌ కానిస్టేబుల్‌

ఆర్టీవో, ఎంవీఐ, ఏఎంవీఐ

5) దళిత అభివృద్ధి శాఖ

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు

జిల్లా అధికారులు

6) సీసీఎల్‌ఏ

నాయబ్‌ తహసీల్దార్‌

తహసీల్దార్, ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్, సర్వే ఇన్‌ స్పెక్టర్‌

7) పన్నుల శాఖ

ఏసీటీవో

సీటీవో, డీసీటీవో

8) స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

సబ్‌ రిజిస్ట్రార్ గ్రేడ్‌–1, డీఆర్, ఏఐజీ

9) సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌

డిప్యూటీ సర్వేయర్‌

సర్వే ఇన్‌స్పెక్టర్, ఏడీ

10) ఎక్సైజ్‌ శాఖ

సీనియర్‌ అసిస్టెంట్‌

ఏఈఎస్, ఈఎస్‌

11) పంచాయతీరాజ్‌

గ్రేడ్‌–1 కార్యదర్శి

ఎంపీడీవో, డీఎలీ్పవో, డీపీవో, ఏవో

12) డీటీపీసీ

సర్వేయర్‌

అసిస్టెంట్‌ డైరెక్టర్‌

13) పురపాలక శాఖ

టీపీవో (గ్రేడ్‌–2, 3)

మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2, 3)

14) ఉపాధి కల్పన శాఖ

లైబ్రేరియన్‌

ఐటీఐ ప్రిన్సిపాళ్లు, డీఈవో

15) ఐ అండ్‌ పీఆర్‌

ఏపీఆర్వో

డీపీఆర్వో

16) నీటిపారుదల శాఖ

సూపరిండెంట్‌

ఏఈఈ, ఏఈ

17) పరిశ్రమల శాఖ

సూపరిండెంట్‌

కోఆపరేటివ్‌ సబ్‌రిజి్రస్టార్, ఐపీవో

18) వైద్య విధాన పరిషత్‌

స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎం

హెడ్‌నర్సు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

19) వ్యవసాయ శాఖ

ఏఈవో (గ్రేడ్‌–2)

ఏఈవో (గ్రేడ్‌–1), ఏవో, ఏడీ

20) సహకార శాఖ

జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌

డిప్యూటీ, అసిస్టెంట్‌ రిజి్రస్టార్లు

21) బీసీ సంక్షేమ శాఖ

హాస్టల్‌ వెల్ఫేర్‌ఆఫీసర్‌(గ్రేడ్‌–1, 2)

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి

22) పౌరసరఫరాల శాఖ

డిప్యూటీ తహసీల్దార్‌

జిల్లా అధికారి

23) కుటుంబసంక్షేమ శాఖ

స్టాఫ్‌నర్సు, ఎంపీహెచ్‌ఎస్‌

హెడ్‌నర్సు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

24) ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌

హెడ్‌ కానిస్టేబుల్‌

ఆర్‌ఐ, డీఎస్పీ

25) జైళ్ల శాఖ

డిప్యూటీ జైలర్‌

డిప్యూటీ సూపరిండెంట్‌

26) అటవీ శాఖ

డిప్యూటీ రేంజర్‌

రేంజర్‌

27) ట్రెజరీ శాఖ

సబ్‌ట్రెజరీ అధికారి

అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి

28) ప్రాథమిక విద్యా శాఖ

సూపరిండెంట్‌

ఎంఈవో, డైట్‌ లెక్చరర్లు

29) కాలేజీ విద్యా శాఖ

సూపరిండెంట్‌

లెక్చరర్‌

30) ఇంటర్‌ విద్యా శాఖ

సూపరిండెంట్‌

జూనియర్‌ లెక్చరర్‌

(నోట్‌: అన్ని శాఖల పరిధిలో జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కింద పరిగణించకుండా మిగిలిన పోస్టులన్నీ రాష్ట్రస్థాయి పోస్టులుగా పరిగణించాల్సి ఉంటుంది)
Published date : 07 Aug 2021 03:31PM

Photo Stories