Skip to main content

కోవిడ్ సంక్షోభంలో విద్యాభ్యాసానికి ఆన్‌లైనే లైఫ్‌లైన్: గవర్నర్ తమిళిసై

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో విద్యారంగానికి ఆన్‌లైన్ విధానమే లైఫ్‌లైన్(జీవనరేఖ)గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఆధ్వర్యంలో మంగళవారం ‘ఆన్‌లైన్ అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జరిగిన వర్చువల్ సదస్సులో గవర్నర్ మాట్లాడారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య అందించేందుకు అవసరమైన పథకాలు రూపొందించడంతో పాటు వాటి అమలు దిశగా అడుగులు వేయాలన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అందరికంటే ముందుగా తెలంగాణ ఉన్నత విద్య శాఖ ఏప్రిల్‌లోనే డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన ప్రారంభించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. టెక్నాలజీ, ఆవిష్కరణల ఫలితాలు అట్టడుగు వర్గాలకు చేరాలని గవర్నర్ సూచించారు. భౌతికంగా విద్యార్థులను ఒకచోట చేర్చి చదువు చెప్పలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ విధానం, టెక్నాలజీ సాయంతో విద్యాభ్యాసం కొనసాగు తోందని గవర్నర్ అన్నారు. డిజిటల్ ఇండియా మిషన్, డిజిటల్ క్లాస్‌రూం పథకాల ద్వారా ఆన్‌లైన్ విద్యా విధానం సులభతరమైందని చెప్పారు. కోవిడ్‌తో ఇంటికే పరిమితమైన విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని గవర్నర్ అన్నారు.
Published date : 26 Aug 2020 01:46PM

Photo Stories