కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వివాహిత మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి హర్షం వ్యక్తం చేశారు.
Published date : 30 Jul 2021 04:08PM