జ్వరం, జలుబుంటే తగ్గే వరకు బడికి రాకండి: పాఠశాల విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు జ్వరం, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మూడ్రోజులపాటు బడికి రావద్దని లేదా ఆ లక్షణాలు తగ్గే వరకు రావద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
అలాగే ఆ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలని, తగిన చికిత్స తీసుకో వాలని పేర్కొంది. ఈ మేరకు మార్చి 5 (గురువారం)నపాఠశాల విద్యాశాఖ అదనపు డెరైక్టర్ సీహెచ్ రమణకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవోలు తమ జిల్లాల్లోని పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం పాఠశాల అసెంబ్లీలో కోవిడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిం చాలని తెలిపారు. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటివి చేయాలని విద్యా ర్థులకు చెప్పాలన్నారు. పాఠశాలల పనివేళల్లో కనీసం మూడు నాలుగుసార్లు చేతులు శుభ్ర పరచుకునేలా అవసరమైన లిక్విడ్‌స అందు బాటులో ఉంచాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జాగ్రత్తలను పాఠ శాలల నోటీసు బోర్డుల్లో డిస్‌ప్లే చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల తలుపులు, దర్వా జాలు సబ్బుతో క్లీన్ చేయాలని పేర్కొన్నారు. ఎవరి కుటుంబాల్లోనైనా కోవిడ్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారు ఉంటే వారిని 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఉంచి తగిన చర్యలు చేపట్టాలన్నారు.
Published date : 06 Mar 2020 01:49PM