జూలైలోనే సీఏ– 2021 పరీక్షలు నిర్వహిస్తాం
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం, సెప్టెంబర్–అక్టోబర్‌లో మూడో వేవ్ వచ్చే అవకాశాల నేపథ్యంలో సీఏ పరీక్షల నిర్వహణకు జూలైనే అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్పష్టం చేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూన్ 27వ తేదీ నాటికి 3,74,230 మంది అభ్యర్థుల్లో 2,82,000 మంది ఆడిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నారని, పరీక్షకు హాజరు కావాలని వారంతా ఆత్రుతగా ఉన్నారని తెలిపింది. జూలై 5న షెడ్యూలు నేపథ్యంలో దీనిపై వెంటనే విచారించాలని ఐసీఏఐ కోరింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
చదవండి: జూలై 17న తెలంగాణ పాలిసెట్– 2021 పరీక్ష
చదవండి: జూలై 25న బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ – 2021 ప్రవేశ పరీక్ష
చదవండి: జూలై 17న తెలంగాణ పాలిసెట్– 2021 పరీక్ష
చదవండి: జూలై 25న బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ – 2021 ప్రవేశ పరీక్ష
Published date : 29 Jun 2021 04:19PM