జోసా - 2020 సీట్ మాట్రిక్స్ విడుదల: జాతీయ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 50,798 సీట్లు
తాజాగా ఏయే విద్యా సంస్థల్లో ఎన్ని సీట్లున్నాయో కేటగిరీల వారీగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ-2020 సీట్ మాట్రిక్స్ విడుదల చేసింది. దీన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో తొలి ఏడాది ప్రవేశాలకు మొత్తంగా 50,798 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. వీటిని ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో ఏయే రిజర్వేషన్ల పరిధిలో ఎన్ని సీట్లు, విద్యా సంస్థల వారీగా అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిలో అందుబాటులో ఉన్న సీట్లు తదితర పూర్తి సమాచారాన్ని ఈ జాబితాలో పొందుపర్చింది.
కేటగిరీల వారీగా సీట్లు ఇలా...
మొత్తం సీట్లు | 50,798 |
ఓపెన్ | 20,303 |
ఓపెన్ డిజేబుల్ | 1,032 |
జనరల్ ఈడబ్ల్యూఎస్ | 4,536 |
జనరల్ ఈడబ్ల్యూఎస్ డిజేబుల్ | 242 |
ఎస్సీ | 7,149 |
ఎస్సీ డిజేబుల్ | 384 |
ఎస్టీ | 3,978 |
ఎస్టీ డిజేబుల్ | 218 |
ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) | 12,340 |
ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) డిజేబుల్ | 616 |