జేఈఈలో ఏటేటా బాలికల జోరు.. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య తగ్గుతున్నా..
Sakshi Education
గత ఏడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే.. జేఈఈకి హాజరవుతున్న విద్యార్థినుల సంఖ్య రెండేళ్లు తగ్గినా మళ్లీ పెరుగుతోంది. 2014లో 23 శాతంగా ఉంది. అప్పట్లో 13.56 లక్షల మంది అభ్యర్థుల్లో బాలికలు 3.16 లక్షలమంది.
2015 నుంచి వారిసంఖ్య పెరుగుతూ వచ్చినా 2017, 2018ల్లో తగ్గింది. 2018 జేఈఈ మెయిన్‌లో దరఖాస్తు చేసిన 11.48 లక్షల మందిలో 24 శాతం మంది మాత్రమే బాలికలు. 2019 నుంచి జేఈఈని ఏటా రెండుసార్లు నిర్వహించడం ప్రారంభించడంతోపాటు మహిళలకు ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా ఏర్పాటుచేయడంతో వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019 జనవరి జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసిన 12.37 లక్షల మందిలో 3.61 లక్షల మంది (29 శాతం), 2020 జనవరి జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసిన 11.47 లక్షల మందిలో 3.77 లక్షల మంది (32 శాతం) బాలికలున్నారు. అంతకుముందు జేఈఈలో బాలికల శాతం తక్కువగా ఉండడంతో కేంద్రం జాతీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో బాలికల నమోదును పెంచేందుకు వారికోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లను సూపర్ న్యూమరరీ కింద మంజూరు చేసింది. 2018-19లో 14 శాతంతో ప్రారంభించిన ఈ సూపర్ న్యూమరరీ కోటా 2019-20లో 17 శాతానికి పెంచారు. 2020-21 నుంచి దాన్ని 20 శాతానికి పెంచడం వారిసంఖ్య మరింత పెరిగేందుకు దోహదపడుతోంది.
ఎక్కువసార్లు నిర్వహించడం కూడా బాలికల చేరికలకు ఊతం..
గతంలో జేఈఈని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించేది. తరువాత జాతీయస్థాయిలోని అన్ని పరీక్షల నిర్వహణకు కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి జేఈఈ మెయిన్స్ను నాలుగు దశల్లో నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. గతంలో ఒక్కసారే జరిగినప్పుడు బాలికలు పూర్తిగా హాజరయ్యేందుకు అంత వెసులుబాటు ఉండేది కాదు. తరువాత దాన్ని రెండు విడతలకు పెంచగా కొంతమేర వారి శాతం పెరిగింది. ఇప్పుడు నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ నిర్వహణ వల్ల బాలికల శాతం ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సూపర్ న్యూమరరీ కోటాతో మరింత ప్రోత్సాహం..
ఐఐటీలలో బాలకల చేరికలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి వారికి ఆయా సంస్థల్లో 20 శాతం మేర అదనంగా సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తోంది. జేఈఈ అడ్వాన్సుకు అర్హత సాధించే జేఈఈ మెయిన్స్ అభ్యర్థుల నుంచి మహిళా అభ్యర్థులను ఈ సూపర్ న్యూమరరీ కోటాకు ప్రత్యేక జాబితాను కూడా ఎన్టీయే విడుదల చేస్తోంది. ఐఐటీలలో అదనపు సీట్లు బాలికలకు కేటాయింపుతో జేఈఈ మెయిన్‌ను రాసే బాలికల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
- డాక్టర్ రామకృష్ణ, కార్పొరేట్ విద్యాసంస్థ అధ్యాపకుడు, విశాఖపట్నం
మెడిసిన్ సీట్లు తక్కువగా ఉండడమూ ఒక కారణమే..
ఇంటర్మీడియట్‌లో బైపీసీ కోర్సు పూర్తిచేసే అభ్యర్థులు నీట్ పరీక్ష రాసి వైద్య సీట్లను పొందాలి. వైద్యసీట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న ఐఐటీ తదితర సంస్థల్లో ఇంజనీరింగ్ చదువులకు వీలుగా తల్లిదండ్రులు తమ పిల్లలను జేఈఈ వైపు దృష్టి సారించేలా ఇంటర్మీడియట్‌లోనే చూస్తున్నారు. ఇదికూడా బాలికల చేరికల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
- జి.వెంకటేశ్వరరావు, కార్పొరేట్ విద్యాసంస్థ మేథ్స్ అధ్యాపకుడు, విజయవాడ

Published date : 19 Jan 2021 03:58PM