Skip to main content

జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు: ఆంగ్లంలో పరీక్ష రాసేందుకే మొగ్గు!

సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.
గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జేఈఈ మెయిన్2021 సిలబస్, ప్రిపరేషన్ గెడైన్స్, మాక్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, కట్‌ఆఫ్ ర్యాంక్స్, మోడల్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్ ను ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. ఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్‌టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం.

మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు
జేఈఈ మెయిన్స్ ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు.

నాలుగు దశల్లో పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్లు

దశ

దరఖాస్తులు

మొదటి దశ (ఫిబ్రవరి)

6,61,761

రెండో దశ (మార్చి)

5,04,540

మూడో దశ (ఏప్రిల్)

4,98,910

నాలుగో దశ (మే)

5,09,972


వివిధ భాషల్లో పరీక్ష రాసేందుకు రిజిస్టర్ అయిన వారు

ప్రాంతీయ భాష

దరఖాస్తు

తెలుగు

371

తమిళం

1,264

కన్నడ

234

మలయాళం

398

మరాఠీ

658

ఒడియా

471

పంజాబీ

107

ఉర్దూ

24

అస్సామీ

700

బెంగాలీ

24,841

గుజరాతీ

44,094

హిందీ

76,459


నాలుగు దశల్లో పరీక్షల షెడ్యూల్

ఫిబ్రవరి

23, 24, 25, 26

మార్చి

15, 16, 17, 18

ఏప్రిల్

27, 28, 29, 30

మే

24, 25, 26, 27, 28


కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో దరఖాస్తులు ఇలా..

రాష్ట్రం

ఫిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

మొత్తం

ఆంధ్రప్రదేశ్

87,797

53,323

53,576

60,222

2,54,918

తెలంగాణ

73,782

52,389

48,868

51,896

2,26,935

మహారాష్ట్ర

76,744

65,775

55,123

69,036

2,66,678

ఉత్తరప్రదేశ్

71,676

50,697

51,868

53,721

2,27,962


పరీక్షల సెషన్ సమయాలు
  • ఉదయం సెషన్ : 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
  • మధ్యాహ్నం సెషన్ : మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
Published date : 06 Feb 2021 03:36PM

Photo Stories