జేఈఈ, ఇతర ప్రవేశ పరీక్షలపై 10న స్పష్టత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్, నీట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణపై డిసెంబర్ 10వ తేదీన స్పష్టత రానుంది.
ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు మేధావులతో మాట్లాడుతానని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. మరోవైపు ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్ నిర్వహించేలా ఇప్పటికే ఎన్‌టీఏ కసరత్తు చేస్తోంది.
Published date : 05 Dec 2020 05:12PM