ఇక యూనివర్సిటీలన్నిటికీ ఒకే ఎంట్రన్స్ టెస్ట్.. ఎందుకంటే..!
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు వేర్వేరు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది.
వీటికోసం విద్యార్థులు ఎంతో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ తరహాలో యూనివర్సిటీలన్నింటికీ ఒకే కామన్ ఎంట్రŒన్స్ టెస్ట్ నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదనలు పంపనున్నారు. ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అందుబాటులోకి వస్తే విద్యార్థులు సులువుగా తమకు నచ్చిన యూనివర్సిటీలో చేరే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రవేశ పరీక్షల ఫీజుల భారమూ తగ్గుతుంది.
వేర్వేరు ప్రవేశ పరీక్షల నుంచి విముక్తి
రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో స్టేట్ యూనివర్సిటీలు 31 ఉన్నాయి. వీటిలో సంప్రదాయ వర్సిటీలు 10, స్పెషలైజ్డ్ వర్సిటీలు 19, పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో 2 ఉన్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీల్లోని కోర్సులతోపాటు వాటి పరిధిలోని వివిధ ప్రైవేటు కళాశాలల్లోని అండర్‌గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టుగ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లోని సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుగా ఎంసెట్, పీజీసెట్, తదితర ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించినవారికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తున్నారు. అలాగే సంప్రదాయ వర్సిటీలతోపాటు కొన్ని స్పెషలైజ్డ్ వర్సిటీలు కూడా తమ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వేర్వేరు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు అనేక రకాల ప్రవేశ పరీక్షలతో వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. వర్సిటీలు ఈ పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండడం కూడా విద్యార్థులకు సంకటంగా మారుతోంది. వేర్వేరు ప్రవేశ పరీక్షలను రాయడం, సీటు వచ్చాక ఫీజులు చెల్లించడం, తర్వాత మరో మంచి వర్సిటీలో చేరాల్సి వస్తే మళ్లీ ఫీజులు చెల్లించాల్సి రావడంతో ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. ఒకే రకమైన కోర్సుకు వర్సిటీలు వేర్వేరు అర్హతలను నిర్దేశిస్తుండటం కూడా ఇబ్బందిగా మారుతోంది. దీనివల్ల ఒక వర్సిటీలోని కోర్సుకు అర్హుడైన అభ్యర్థి మరో వర్సిటీలో అనర్హుడిగా మారుతున్నాడు. ప్రవేశాల కల్పనలోనూ వర్సిటీలు పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని.. ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల తరహాలో వర్సిటీల కోర్సులకూ ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు, విద్యామండలికి విద్యార్థులు ఎప్పటి నుంచో విన్నవిస్తున్నారు.
ప్రతిపాదనల రూపకల్పనకు ఏర్పాట్లు
విద్యార్థుల వినతుల నేపథ్యంలో రాష్ట్రంలోని వర్సిటీలన్నిటిలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రస్తుతం ఏర్పాట్లు చేపట్టింది. వర్సిటీల ఉపకులపతులను ఒక వేదికపైకి తెచ్చి ఉన్నత విద్యామండలి ద్వారా ఈ ప్రవేశ పరీక్షను చేపట్టాలని భావిస్తోంది. వర్సిటీల్లో వివిధ కోర్సులు వేర్వేరు కాంబినేషన్లతో, నిబంధనలతో ఉంటున్నాయి. వీటిలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించడం ఒకింత క్లిష్టతరమే అయినా అసాధ్యం మాత్రం కాదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
2020–21లో వివిధ ప్రవేశ పరీక్షలు, వాటికి హాజరైన విద్యార్థుల సంఖ్య ఇలా..
రాష్ట్రంలో వివిధ వర్సిటీలు ఇలా..

ప్రవేశ పరీక్ష | కోర్సులు | విద్యార్థులు |
ఏపీ ఎంసెట్ | బీఈ, బీటెక్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫార్మసీ | 2,73,588 |
ఏపీ ఈసెట్ | డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ సెకండియర్‌లోకి లేటరల్ ఎంట్రీ | 37,167 |
ఏపీ ఐసెట్ | ఎంబీఏ, ఎంసీఏ, లేటరల్ ఎంట్రీ ఎంసీఏ | 64,884 |
ఏపీ పీజీఈసెట్ | ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌డీ | 28,868 |
ఏపీ ఎడ్‌సెట్ | బీఈడీ | 15,658 |
ఏపీ లాసెట్/పీజీలాసెట్ | ఎల్‌ఎల్‌బీ (3 ఏళ్లు), ఎల్‌ఎల్‌బీ (5 ఏళ్లు), ఎల్‌ఎల్‌ఎం | 18,371 |
ఏపీ పీఈసెట్ | బీపీఈడీ, యూజీడీపీఈడీ | 3,096 |
డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లు | యూజీ నాన్ ప్రొఫెషనల్ కోర్సులు | 2,62,000 |
రాష్ట్రంలో వివిధ వర్సిటీలు ఇలా..
స్టేట్ యూనివర్సిటీలు: | కన్వెన్షనల్ 10 |
స్పెషలైజ్డ్ 19 | పీపీపీ మోడ్ 02 |
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ 8 | సెంట్రల్ వర్సిటీలు 3 |
డీమ్డ్ వర్సిటీలు 5 | ప్రైవేటు వర్సిటీలు 8 |
మొత్తం | 55 |
Published date : 01 Mar 2021 04:23PM