Skip to main content

ఈ ఏడాది ‘టైమ్స్’ ర్యాంకింగ్స్ లో పాల్గొనం: ఐఐటీలు

న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఇచ్చే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్‌ఈ) ర్యాంకింగ్స్ సను ఈ సంవత్సరం(2020) బహిష్కరిస్తున్నట్లు భారత్‌లోని ఏడు ప్రఖ్యాత ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు ప్రకటించాయి.
ఉత్తమ విద్యా సంస్థలుగా ప్రకటించేందుకు టీహెచ్‌ఈ అనుసరిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శించాయి. బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు ఏప్రిల్ 16న ఉమ్మడిగా ఈ ప్రకటన చేశాయి. ‘ఈ సంవత్సరం ర్యాంకింగ్స్ లో ఈ ఏడు ఐఐటీలు పాల్గొనడం లేదు. ర్యాంకింగ్ ప్రక్రియ విధి, విధానాలు, పారదర్శకతపై టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు సంతృప్తికర వివరణ ఇస్తే 2021 సంవత్సర ర్యాంకింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తాం’అని స్పష్టం చేశాయి.
Published date : 17 Apr 2020 01:58PM

Photo Stories