ఈ బ్యాంక్‌లోని ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లు
Sakshi Education
ముంబై: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్యపురి తమ ఉద్యోగులకు ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విషయంలో కొండంత భరోసాను ఇచ్చారు.
అవన్నీ భద్రమని, ఆందోళనలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రేరిత అంశాలు ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆదిత్యపురి 1.15 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు ఇటీవల 10 నిముషాల వీడియో సందేశం పంపారు. ''మీకు ఉద్యోగ భద్రతేకాదు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లూ అన్నీ భద్రం'' అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. తన వారసుడు శశిధర్ జగదీశన్‌సహా మేనేజ్‌మెంట్ తరఫున తాను ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ బాధ్యతల నుంచి ఆదిత్యపు అక్టోబర్ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు.
Published date : 07 Oct 2020 04:42PM