ఎఫ్‌ఎంఎస్‌లో 100 శాతం సమ్మర్ ప్లేస్‌మెంట్స్
Sakshi Education
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన ఢిల్లీలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ (బీస్కూల్) ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎఫ్‌ఎంఎస్).. ఎంబీఏ (2020-22 బ్యాచ్) విద్యార్థులకు అద్భుతమైన సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్స్ లభించినట్లు పేర్కొంది.
కొవిడ్-19 ప్రతికూల పరిస్థితుల్లోనూ నూటికి నూరుశాతం మంది విద్యార్థులు అవకాశాలు అందుకున్నట్టు ఎఫ్‌ఎంఎస్ ప్రకటించింది. రెండు నెలల కాలపరిమితి గల ఈ ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులు సగటున రూ.2,41,400 స్టైఫండ్ పొందినట్టు ఇనిస్టిట్యూట్ తెలిపింది. గతేడాదితో పొలిస్తే ఈ మొత్తం 5 శాతం అధికమని, ఈ సంవత్సరం బ్యాచ్‌లో 64 శాతం (183 మంది) అభ్యర్థులు రూ.2లక్షల కంటే అధికంగా స్టైఫండ్ పొందారు. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 42శాతం మంది, కన్సల్టింగ్ అండ్ జనరల్ మేనేజ్‌మెంట్ డొమైన్స్ లో 18 శాతం, ఫైనాన్స్ విభాగంలో 12శాతం మంది అవకాశాలు అందుకున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పాల్గొన్న సంస్థల్లో.. యాక్సెంచర్ ్ట్రాటజీ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, కాప్‌జెమినీ, గార్ట్‌నర్, హెచ్‌ఎస్‌బీసీ, జేఎస్‌డబ్ల్యు, మాస్టర్ కార్డ్, ఆర్‌పీజీ, స్పార్క్ క్యాపిటల్, టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐటీసీ, ఆసియా పెయింట్స్, కోకాకోలా, హిం దూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్), ఐటీసీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఎల్ ఓరియల్, మొండేలెజ్, రెకిట్ట్ బెంకిజర్, శామ్‌సంగ్, టాటా స్కై, యునెటైడ్ బ్రూవరీస్ ఉన్నాయి. ఈకామర్స్/ఐటీ/ఆపరేషన్స్‌లో 43 శాతం వృద్ధి నమోదైంది. ఒక్క ఈకామర్స్‌నే చూసుకుంటే.. 34 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. అమెజాన్, అడోబ్, బైజు, క్లౌడ్‌టైల్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, ఇన్ఫోఎడ్‌జ, మైక్రోసాఫ్ట్, ఆప్టమ్, పర్పల్, ఉడాన్ వంటి సంస్థలు ఎఫ్‌ఎంఎస్ విద్యార్థులకు ఆఫర్లు అందించాయి.
Published date : 29 Dec 2020 01:22PM