Skip to main content

ఏప్రిల్‌లో టీఎస్ డీఎడ్ ద్వితీయ సంవత్సర పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: డీఎడ్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందుకు ఫిబ్రవరి 8 లోగా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 11 వరకు చెల్లించవచ్చని చెప్పారు. 2018-20 బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులతోపాటు 2017-19 బ్యాచ్ విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పుడు 2015-17 బ్యాచ్‌లో ఫెయిలైన విద్యార్థుల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. నాలుగైదు సబ్జెక్టులకు రూ.250, 3 సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు చెప్పారు.
Published date : 30 Jan 2020 05:03PM

Photo Stories